‘ధన’ధన్-7 : ప్రైవేటీకరణ పాట్లు

అలా నడిచింది డి-మోనెటైసెషన్ వ్యవహారం. మొత్తం మీద మోడీ గారి నిర్ణయాల పుణ్యాన డిజిటల్ సేవలు అందించే ప్రైవేట్ సంస్థలు భారత మార్కెట్ ని దున్నేస్తున్నాయనే చెప్పాలి. ఇంకాస్త ముందుకెళ్లి పరిస్థుతలని అవగాహనకి తెచ్చుకుందాం. డిజిటల్ సేవలకు అలవాటు పడ్డవాళ్ళు ఆనందంగానే వాడేసుకుంటున్నారు. మరి నిరక్షరాస్యులైన వారి సంగతేంటి? డిజిటల్ ప్రపంచానికి ఇంకా చేరలేనంత దూరాన ఉన్న గ్రామీణ భారత పరిస్థితేంటి?

ఇదిలా ఉంటే, అకౌంటబిలిటీ పేరున ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్ తప్పనిసరి అన్న ప్రభుత్వం మాట, అనాదిగా తమ సొమ్ముని తమ దగ్గరే దాచుకోడానికి ఇష్టపడే ఎంతో మందికి మింగుటపడటం లేదు. అదీ నిజమే, అస్సలు బ్యాంకుల పై ఆధారపడాల్సిన అవసరమేంటి? తాము కష్టపడి పొందిన సంపాదనని తమ దగ్గర కాక బ్యాంకులోనో, మరింకెక్కడో ఎందుకు దాచుకోవాలి? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గరకాని, బ్యాంకుల దగ్గర కానీ సమాధానం ఉండకపోవచ్చు.

ఏదేమైనా డిజిటల్ రెవల్యూషన్ పేరిట భారత ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు బాగానే సహకరిస్తోంది. ప్రభుత్వ సహకారంతో తమ మార్కెట్ ని మరింత విస్తృతం చెయ్యడంలో భాగంగా ఆ సంస్థలు దేశంలోని మారు మూల ప్రాంతాల్లోకి సైతం బాగానే చొరబడుతున్నాయ్. తద్వారా అంతర్జాల సేవలు దేహస నలుమూలల వ్యాపిస్తున్నాయి. పైగా విజ్ఞానం అరచేతిలోకి వచ్చేయడంతో మొబైల్ ఫోన్ల ద్వారా అంతర్జాల సేవల వినియోగం ఊపందుకుంది. ఆ విధంగా డిజిటల్ లావాదేవీలు మరో స్థాయికి వెళ్తున్నాయి.

ఫలితంగా, పల్లెల్లో సైతం ఆధునికత పెరిగి జనాల జీవనశైలిలో ఎంతో మార్పు సంతరించుకుంది. ఆలా డి-మోనెటైసెషన్ పేరిట మొత్తం మీద ఆధునీకరణ, పట్టణీకరణలు ఊపిరి పోసుకున్నాయి. రిటైల్, ఈ-కామర్స్, మొబైల్ తయారీ, ఇతర అనుసంధాన పరిశ్రములు ఊహించని ఊపే అందుకున్నాయి. అభివృద్ధి పేరిట సాగుతున్న ప్రభుత్వ-ప్రైవేట్ ఉమ్మడి ప్రయాణం ఇంకెంత దూరం వెళ్తుందో వేచి చూడాల్సిందే. ఏదేమైనా, భారత దేశంలో అంత్యంత జనసంఖ్య పల్లెల నుండి ఉందన్న విషయాన్ని ఒకటికి రెండు సార్లు గమనించి, ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకునేముందు, అన్నం పెట్టే రైతాంగాన్ని, వెన్నెముకైనటువంటి వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s