‘ధన’ధన్-8: పనిలో పనిగా…

‘ధన’ధన్ మునుపటి భాగాల్లో డి-మోనెటైసేషన్ పేరిట మోడీ ప్రభుత్వం ఏ విధంగా ‘ఎదో చెప్పి ఇంకేదో చేసిందో’ చూసాం. కానీ ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన  విషయం మరొకటుంది. డి-మోనెటైసేషన్ అంశంలో ‘నల్లధనం’ అనే మాట కనుమరుగవుతూ ‘డిజిటల్ లావాదేవీల’ ప్రస్తావన తెరపైకి వచ్చే మధ్య మార్గంలో ఇంకో వ్యూహం రూపు దాల్చింది, అదే “రిలయన్స్ జియో”. నిజానికి, జియో పుట్టుక డి-మోనెటైసేషన్ అంశం కన్నా ముందే ఉండివుంటుంది.  కానీ మోడీ గారు లేవనెత్తిన డిజిటల్ లావాదేవీల.  అంశం జియో కి కావాల్సిన అవకాశాన్ని ఇచ్చిందనే చెప్పాలి. అలా మోడీ గారు డి-మోనెటైసేషన్ లో భాగంగా…డిజిటల్ అంశాన్ని తెరపైకి తెచ్చారో లేదో, రిలయన్స్ సంస్థ కూడా తమ జియో సేవల్ని టక్కున తెరపైకి తెచ్చేసింది. మరిదంతా చూస్తే రిలయన్స్ సంస్థకి, మోడీ ప్రభుత్వం డి-మోనెటైసేషన్ పేరిట వేసిన ఎత్తులు ముందే తెలుసునేమో అనిపిస్తుంది. అందుకే సరైన సమయంలో రంగంలోకి దూకి, ఎయిర్టెల్ వంటి పోటీదారుల్ని సైతం వణికించేసింది జియో. పైగా, జియో సేవలు వెళ్తున్న మార్గం న్యాయబద్దంగా లేదని వాపోయిన ఇతర టెలికాం కంపెనీల కేసుల్నిసైతం ప్రభుత్వం మరియు సుప్రీమ్ కోర్టు లు కొట్టిపడేసాయి. వినకపోగా, జియో ఉచిత సేవలు అందించడానికి రిలయన్స్ కి ఇచ్చిన పరిమిత గడువుని కూడా పెంచుతూనే ఉంది. ప్రభుత్వం నుండి ప్రత్యేక సహకారం లేకుండానే రిలయన్స్ జియో కథ నడుస్తోండాంటే అది అమాయకత్వమే అవుతుంది. ఏదైతేనేం ఉచిత 4G అంతర్జాల సేవలతో జనం చాల ఖుషీగా ఉన్నారనే చెప్పాలి. చూద్దాం ఏమవుతుందో …

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s