ఝడిపిస్తున్న ‘జట్’లు

సమాన హక్కులు మరియు విద్య, ఉద్యోగ మరిన్ని ఇతర రంగాల్లో రిజర్వేషన్ల కోసం భారత్ లోని ఎన్నో కులవర్గాలు కేంద్రానికి తమ గళాన్ని చాలా సార్లే వినిపించాయి, వినిపిస్తునే ఉన్నాయి. అలాంటివాటి కులవర్గాల్లో ఒకటి ‘జట్’ వర్గం. మొన మొన్నటి దాకా కేవలం హర్యానాకే పరిమితమైన జట్ వర్గాల సామూహిక పోరాటం ఇప్పుడు పెనుతుఫానులా మారింది.వేల సంఖ్యల్లో హర్యానా, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్,ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ మరియు మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన జట్ వర్గ ప్రజలు రాజధానిలో తమ వాఙ్కధాటిని వినిపించడానికి గట్టిగానే నిర్ణయించుకున్నట్టున్నారు. అందుకే అబ్బురపరిచే సంఖ్యల్లో ఢిల్లీ లోని జంతరమంతరు వద్ద గుమిగూడారు. “తమ సమస్యల పై దృష్టి సారించకపోతే, ఢిల్లీ కి అందవలసిన మౌలిక సేవలను, సదుపాయాలను ఆపివేస్తామని, ప్రభుత్వానికి తాము కట్టవలసిన కరెంటు మరియు నీటి బిల్లులను అలాగే తీర్చవల్సిన రుణ సొమ్మును సైతం కట్టబోమని,” హెచ్చరించారు. అదే కాక గత ఏడాది లో జరిగిన జట్ నిరసనల్లో అరెస్ట్ చెయ్యబడ్డ వారిని కూడా విడుదల చేసి, వారి పై ఉన్న కేసులను కొట్టివేయవల్సిందిగా డిమాండ్ చేసారు. తాము చేస్తున్న ఈ పోరాటాన్ని అసాకారోద్యమంగా మారుస్తామని కూడా ఝడిపించారు.

సమాన హక్కులు మరియు సమాజంలో ప్రత్యేక రేజర్వేషన్ల కోసం పోరాడిన వారిలో రాజస్థాన్ గుర్జర్లు, మహారాష్ట్ర మరాఠాలు మరిన్ని ఇతర వర్గాలు లేకపోలేదు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s