అదరహో కలయిక

టాలీవుడ్ ప్రేక్షకులకు వినూత్న కలయిక అంటే ఎప్పుడు అదో ఊపు. ఒకప్పుడు హీరో హీరోయిన్ కలయికకు మాత్రమే పరిమితమైన కలయిక క్రేజ్, ఇప్పుడు హీరో-డైరెక్టర్ కి మారిపోయిందని చెప్పాలి. ఆలా ఈ మధ్యకాలంలో ఎవరు ఊహించని ఓ క్రేజీ కలయిక రూపు దాల్చింది. బాలయ్య వందో చిత్రం తరువాత ఎవరితో పనిచేయబోతున్నారు అన్న అంశానికి మొన్నీమధ్యే తెరపడింది. తెరపడ్డం కూడా మాములుగా కాదు, అందర్నీ అబ్బురపరిచే స్థాయిలో, నటసింహం బాలకృష్ణ- దర్శకుడు పూరి జగన్నాధ్ ల కలయికగా జనాల ఆలోచనల అంచనాల్ని మించేలా రూపుదాల్చింది. మార్చి ౯, 2017 న ముహూర్తం జరుపుకోబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్, సెప్టెంబ్ర్ నెలలో విడుదల అని కూడా చెప్పిందని తెలుగు చిత్ర వర్గాల సమాచారం. మరి మొదటి లుక్ కోసం ఈ పాటికే పూరి మరియు బాలయ్య అభిమానులు నిరీక్షణ మొదలెట్టేసుంటారు.

ఇంకా కథ ఇతర విషయాలపై స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, ఈ చిత్రం ఇలా ఈ ఇద్దరు కలిసి పని చేస్తున్నారు అనడంలోనే ఒక సంచలనం ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s