వజ్ర దంతాలా?

సృష్టిలో అన్నిటికన్నా గట్టిదైన వస్తువు వజ్రం అని మనందరికీ తెలుసు. ఇతర ఏ వస్తువునైనా కోయగల శక్తి వజ్రానికి ఉందనే విషయం విదితమే. మరి వజ్రం లాంటి పళ్ళున్న జీవి గురించి మీరెప్పుడైనా విన్నారా? అయితే ఇది చదవండి. భారత్-నేపాల్స రిహద్దు ప్రాంతంలో ప్రవహించే గండకీ అనే నది ఒకటుంది. విష్ణు భగవానుని రూపాలైన సాలగ్రామ రాళ్లకు నివాసం కావడం వలన ఈ నది ప్రపంచవ్యాప్తంగా హిందువులకు చాల ప్రాముఖ్యమైనది. అదే నదిలో నివసిస్తాయి, ‘వజ్రకీటకాలు’ అనే జీవాలు/పురుగులు. సాలగ్రామాలు భగవంతుడు విష్ణువు యొక్క రూపాన్ని, ఆయుధాల్ని పోలి వివిధ ఆకారాల్లో లభ్యమవుతాయ్. శంఖ, చక్ర, గదా, పద్మాల రూపాలు పోలిన సాలగ్రామాలు మొత్తం 24 రకాలు. మనకు తెలియనివి మరెన్నో ఉండి ఉండవచ్చు. మరి సాలగ్రామాలు అనబడే ఈ రాళ్లు ఆలా వివిధ రూపాల్ని ఎలా పొందుతాయనే విషయం మనల్ని విస్మయానికి గురిచేస్తుంది.

వజ్రకీటకాలు అనబడే ఆ పురుగులు సాలగ్రామాలనే ఈ రాళ్ళను వజ్రంలాంటి తమ పళ్లతో కొరికి చీలుస్తాయట. అలా చీల్చి ఆ రాళ్ళలో ప్రవేశించిన ఆ జీవాలు చివరి శ్వాస వరకు అందులోనే ఉండి, అక్కడే మరణిస్తాయట. ఆలా చీల్చే క్రమంలో ఆ రాళ్లు వివిధ రూపాలను పొందుతాయి, ఆ రూపాలే విష్ణు రూపాన్ని, మరియు ఆతని శంఖ, చక్ర, గదా పద్మాలను పోలి ఉంటాయి. ఇటువంటి సాలగ్రామాలు లెక్కలేనన్ని ఆ నదిలో దొరుకుతాయట. ఆ నది నుండి ఈ సాలగ్రామాలు దేశ వ్యాప్తంగా కాశి మరియు ఇతర పుణ్యక్షేత్రాల్లో, ఇతర ఓపెన్ మార్కెట్లలో కూడా లభిస్తాయి. అంతే కాక ఇతర దేశాలకు కూడా ఎగుమతులు చేయబడతాయి.

ఈ సాలగ్రామాల్ని ఇంట్లో పెట్టుకోవాలంటే చాల పద్దతిగా పూజా సంప్రదాయాలు తప్పనిసరని పెద్దలు చెప్తారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s