‘దేవుడు పెట్టిన భిక్ష’

మాములుగా సినిమా అనేది కేవలం సరదాను తీర్చుకోడానికి కదా అనుకుంటారు. కానీ అదే పరిశ్రమ పై ఆధారపడిన వారికి అదే జీవనాధారం, జీవితం. అలా తానూ చేసిన ప్రతి సినిమా తనకు జీవిత పాఠాన్ని నేర్పుతూ వచ్చింది అంటున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మొన్నీమధ్య జరిగిన  తన కాటమరాయుడు చిత్రం ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మనసు విప్పి మాట్లాడారు పవన్.  పంచకట్టులో కన్పించిన తన సినీ జీవిత చరిత్ర గురించి చెప్పుకొచ్చారు. సినిమా రంగం పై ముందు నుండి తనకు పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ, ‘దేవుడు పెట్టిన భిక్ష’గా స్వీకరించి తన సినీ ప్రయాణంలో తానెప్పుడూ నిజాయితీ గానే వ్యవహరించానని, తాను ఫలితాలను వ్యక్తిని కానని, జీవిత ప్రయాణమే తనకు ముఖ్యమని అన్నారు పవన్.

మొదటి చిత్రం అక్కడమ్మాయి-ఇక్కడబ్బాయ్ నుండి గబ్బర్ సింగ్ వరకు నడిచిన తన సినీ ప్రస్థానంలో ఎన్నో బ్రతుకు పాఠాలు నేర్చారట పవన్. గోకులంలో సీతలో ప్రేమ గురించి, తమ్ముడు లో బాధ్యత గురించి, బద్రిలో ఒక యువకుడి మనోధైర్యాన్ని, ఇలా…తన ప్రతి చిత్రంలో తనదైన భావాలని తేరా పై చూసుకుని, అలాగే ఏంటో నేర్చుకున్నారట పవన్. దేశం పట్ల తనకున్న భక్తి, ప్రేమను తన ప్రతి చిత్రంలో ఏదోక పాట రూపంలో చూపిస్తూ వచ్చానని అన్నారు పవన్. ఏదైతేనేం  చిరంజీవి తమ్ముడి స్థాయి నుండి లక్షల కొద్దీ అభిమానుల్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు పవన్ కళ్యాణ్, అనడం లో ఎటువంటి సందేహం లేదు.

అదే దిశగా పవర్ స్టార్ తన భావాల్ని ప్రజా సంక్షేమం కోసం తాను స్థాపించిన జనసేన పార్టీ ద్వారా మరింత ఆచరణలోకి తీసుకురావాలని ఆశిస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s