‘ఎలక్ట్రానిక్ పరికరాలు వద్దు’

భద్రతా పరమైన ఆంక్షల్లో భాగంగా అమెరికా ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుండి అమెరికాకు వచ్చే డైరెక్ట్ విమానాల ద్వారా అమెరికాకు ప్రయాణించే ప్రయాణీకులు లాప్టాప్లను, ఐప్యాడ్లను,కెమెరాలను మరియు అటువంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావొద్దని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. వెలువడిన వార్తల ప్రకారం ఈ ఆంక్షలు, ఈజిప్ట్,జోర్డాన్,కువైట్,మొరాక్కో,కతర్,సౌదీ అరేబియా, టర్కీ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి పది దేశాలనుండి అమెరికాకు నేరుగా చేరే విమానాల పై, విధించారట. అయితే ఆరోగ్య సంబంధిత పరికరాలు మరియు సెల్ ఫోన్లను ఈ జాబితా లో చేర్చలేదట.
అమెరికా ప్రభుత్వపు ఈ నిర్నయాయం పై దేశాల పలు విమాన సంస్థలను ఆలోచనకు గురిచేస్తోంది. “ఎలక్ట్రానిక్ పరికరాల పై ఆంక్షలు న్యూయార్క్, చికాగో, డిట్రాయిట్ వంటి ప్రాంతాలకు వెళ్లే తమ విమాన సేవలని దెబ్బతీస్తాయని,” రాయల్ జోర్దానియన్ ఎయిర్లైన్స్ పేర్కొనగా, “రియాద్, జెడ్డా నుండి కదిలే తమ సేవలు దెబ్బతింటాయని సౌదీ,” అరేబియా పేర్కొంది.

Leave a comment