తెగని పంచాయితీ…

పాకిస్తాన్ భారత్ ల మధ్య తగువంటే తీవ్రవాదం లేదా కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించే ఉంటుంది. కాశ్మీర్ సమస్యపై ఇరు దేశాలు ఒక ఒప్పొందానికి రావాలని చాల సార్లు అనుకున్నప్పటికీ ఆ యత్నాలు అనేక కారణాల చేత విఫలమవుతునే ఉన్నాయి.అయితే ఈ సారి కాశ్మీర్ సమస్య పై కాస్త నెమ్మదిగా ఆలోచించాలని అనుకుంటుంటోందట పాకిస్తాన్. అవసరమైతే స్నేహపూర్వకంగానే వ్యవహరించాలని యోచిస్తోందట. పాకిస్తాన్ గణతంత్ర దినోత్సవ సందర్బంగా మాట్లాడుతూ “ఒక్క కాశ్మీర్ విషయమే కాదు, ఇరు దేశాల సత్సంబంధాలని ఇరుకున పెడుతున్న మరిన్ని ఇతర విషయాల పై భారత్ తో స్నేహపూర్వక చర్చలకు సిద్ధంగా ఉన్నామని,” ఆ దేశాధ్యక్షులు మామునూన్ హుస్సేన్ వెల్లడించారట. ఇదే విషయం పాకిస్తాన్ తరపున భారత్ తో వ్యవహరించే అధికారి అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, “కాశ్మీర్ సమస్యను కాశ్మీరీల ఆలోచనలకు అనుగుణంగానే తీర్చాలని,” పలికారు. అదే కాక భారత్ తో సత్సంబంధం పెంచుకోవాలన్న ఆలోచలన పాకిస్తాన్ కు ఎప్పుడూ ఉందని, కాశ్మీర్ సమస్యతో పాటు ఇరు దేశాల సంబంధాన్ని నిలిపే ఇతర సమస్యలు కూడా తొలగిపోవాలని ఆశాభావం వ్యక్తం చేసారు, బాసిత్.

అయితే మోడీ కాబినెట్ లోని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఏమో మరోలా మాట్లాడుతున్నారు. “పాకిస్తాన్  ఆదీనంలో ఉన్న PoK ప్రాంతాన్ని, అలాగే  గిల్గిత్ -బాల్తిస్తాన్ ప్రాంతాలను సైతం పాకిస్తాన్ నుండి విడిపించి, వాటిని సహా కలిసిన అసలైన జమ్మూ కాశ్మీర్ ని పునర్నిర్మిస్తామని” సింగ్ పలికారు.

ఒకరాల ఇంకోరిలా స్పందిస్తుంటే పరిస్థితి మళ్ళీ మాములైనట్టే. చూద్దాం ఏం జరుగుతుందో.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s