ఇకపై హెచ్-1బి కష్టతరం!

అమెరికా రాష్ట్రపతి గా ఎన్నికైన నాటినుండి ఐటి ఉద్యోగులకు నిద్దర లేకుండా చేస్తున్నారు డోనాల్డ్ ట్రంప్. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అని, అమెరికన్ కంపెనీల అవుట్సోర్సింగ్ ఆటలు సాగవని, ఇలా ఎప్పటికప్పుడు చవాకులు కురిపిస్తూనే ఉన్నారు. అదే దిశలో మరో ఘాటు నిర్ణయం తో ముందుకొచ్చింది ట్రంప్ ప్రభుత్వం. ఇతర దేశాల నుండి ఉద్యోగ నిమిత్తం అమెరికా కు వచ్చే ఐటి ఉద్యోగులకు  ఇవ్వబడుతున్నహెచ్-1బి వీసాల విషయంలో పద్దతి సరిగా లేదని, కావున అందుకు సంబంధించి కీలక సవరింపులు, మార్పులు అవసరమని ప్రకటించింది. ఒకప్పుడు సాధారణ ప్రవేశ-స్థాయి కంప్యూటర్ జ్ఞానం ఉంటె చాలు హెచ్-1బి వీసాలు వచ్చేవి. అయితే ఇకపై ఆలా కాదంట. కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉద్యోగానికి హెచ్ -1బి వీసా కావాలంటే, ప్రవేశ-స్థాయి జ్ఞానం ఉంటె చాలదట, ఎదో ఒక ఆధునికమైన వైవిధ్య ప్రోగ్రామింగ్ జ్ఞానం ఉన్నట్టు తప్పనిసరిగా నిరూపించుకోవాలట. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వపు వలస మరియు పౌరసత్వ వ్యవహారాలను చూచే ప్రభుత్వ సంస్థ స్పష్టం చేసింది. అదే కాక పరాయి ఈ వీసాల కోరే కంపెనీలు కూడా ఉద్యోగాలిచ్చే విషయంలో అమెరికా పౌరుల పట్ల వివక్షత చూపితే బాగోదని కూడా ప్రభుత్వం చెప్పిందట.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s