భారత ఉద్యోగులకు మరో దెబ్బ!

మొన్న సింగపూర్ ఆ మొన్న అమెరికా తాజాగా ఆస్ట్రేలియా, ఇలా పలు ప్రముఖ దేశాలు వలస సంబంధిత నిబంధనల్లో పెను మార్పులు తీసుకు వస్తున్నాయి ఈ మధ్య. మొదట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకు మాత్రమే దక్కాలని, ఆ దిశగా తమ కంపెనీలు అమెరికన్లకే ప్రాధాన్యత ఇవ్వమని, ఆ దేశస్తులతో పోటీపడే ఇతర దేశ ఉద్యోగులను వెళ్లిపొమ్మని, ఉద్యోగాలు ఇవ్వబోమని భయపెట్టేసారు.  తర్వాత సింగపూర్ కూడా తమ దేశంలో ఉద్యోగాల విషయంలో తమ దేశస్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆ దేశంలోని కంపెనీలను కోరింది. మరి ఇప్పుడు  ఆస్ట్రేలియా కూడా అదే పాట పడుతోంది. దేశంలోని నిరుద్యోగ సమస్యను అరికట్టే ప్రయత్నంలో ఇక పై ఉద్యోగ రీత్యా తమ దేశానికి రావాలనుకునే వారికీ ఎంతోకాలంగా తామిస్తున్న 457 ఉద్యోగ వీసా పద్దతిని ఇకపై పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఇలా చెయ్యడం వల్ల తమ దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తోందట ఆ ప్రభుత్వం. ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం భారత్ వంటి దేశస్తులకు గట్టి దెబ్బె కానుంది. ఎందుకంటే 457 ఉద్యోగ వీసా పద్దతిని తెగ వాడేసుకుంటున్న వారిలో భారతీయులే అధికంగా ఉన్నారంట. కావున ఆస్ట్రేలియా లో ఉద్యోగాలు చేసుకోవాలనే మన వల్ల కోరిక తీరడం ఇక కష్టతరమేనేమో. భారత్ తో పాటు ఆ జాబితా లో బ్రిటన్ కూడా ఉందట. అయితే ప్రస్తుతం ఉంటున్న వారు ఇబ్బంది పడాల్సిన పనేంలేదంట.
బయట పరిస్థితులు ఇలా తయారవుతుంటే ఇక మన భారత ప్రభుత్వం బయట నుండి తిరిగివచ్చే మన వాళ్లకు ఉద్యోగావకాశాలు కల్పించవలిసిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపై మున్ముందు ఏయే దేశాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s